త్వరలో అమెరికాలో అక్కినేని స్టాంప్ విడుదల..

akkineni-nageswara-rao

స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావుకు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. అక్కేనేని పేరు మీద అమెరికాలో పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఇండియన్ గవర్నమెంట్ పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. అభిమానుల గుండెల్లో నట సామ్రాట్ గా పేరు పొందిన అక్కినేని మరణాంతరం అమెరికాలో ఈ గౌరవం దక్కడం తెలుగు జాతికి గర్వకారణం. అమెరికాలోని అక్కినేని ఫౌండేషన్ అధ్యక్షుడు తోటకూర రఘు ఈ విషయాన్ని వెల్లడించారు.

తోటకూర రఘు మాట్లాడుతూ.. అమెరికాలో యునైటెడ్ స్టేటెడ్ పోస్టల్ సర్వీస్ సంస్థ అక్కినేని పోస్టల్ స్టాంప్ విడుదల చేయడానికి అంగీకరించింది. త్వరలో ఈ స్టాంప్ విడుదల అవుతుంది. ఈ సందర్భంగా అక్కినేని జయంతి రోజు (సెప్టెంబర్ 20)న డల్లాస్ లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నాం. భారతీయ నటుడికి అమెరికాలో ఇటువంటి గౌరవం లభించడం ఇదే మొదటిసారి. అని అన్నారు.

Exit mobile version