అల్లరి నరేష్ ‘ఉగ్రం’ టీజర్ లాంచ్ కి గెస్ట్ గా అక్కినేని హీరో

ugram 1

ఇటీవల అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లింగ్ ఎమోషనల్ మూవీ నాంది. ఈ మూవీలో అల్లరి నరేష్ యాక్టింగ్ కి అందరి నుండి మంచి పేరు లభించింది. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ మూవీని సతీష్ వర్మ నిర్మించారు. ఇక నాంది మూవీ సూపర్ సక్సెస్ తో మరొక్కసారి విజయ్ తో ఉగ్రం అనే యాక్షన్ మూవీ చేస్తున్నారు అల్లరి నరేష్. తన కెరీర్ లో ఫస్ట్ టైం ఇటువంటి పాత్ర చేస్తున్నానని, తప్పకుండా ఉగ్రం మూవీ మీ అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు అల్లరి నరేష్.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని రేపు ఉదయం 11 గం. 34 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. కాగా ఈ టీజర్ ని గ్రాండ్ ఈవెంట్ లో భాగంగా లాంచ్ చేయనున్నారు. రేపు ఉదయం 10 గం. లకు హైదరాబాద్ ఏఎంబి సినిమాస్ లో జరుగనున్న ఈవెంట్ కి అక్కినేని యువ హీరో నాగచైతన్య స్పెషల్ గెస్ట్ గా రానున్నట్లు కొద్దిసేపటి క్రితం ఉగ్రం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మిర్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 5 న ఉగ్రం థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకు రానుంది.

Exit mobile version