బ్యాక్ టు ఫ్యూచర్ కాన్సెప్ట్ తో అక్కినేని మల్టీ స్టారర్ మూవీ?

Published on Sep 18, 2013 3:32 pm IST

Manam
ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ హీరోస్ తాము చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘మనం’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఈ సినిమాలో మూడు తరాల హీరోలు మనకు రివర్స్ లో కనిపించనున్నారు.

మాకు తెలిసిన సమాచారం ప్రకారం నాగ చైతన్య – సమంతలకి కొడుకుగా నాగార్జున కనిపిస్తాడు. అలాగే నాగార్జున – శ్రియలకి కొడుకుగా డా. అక్కినేని నాగేశ్వరరావు కనిపిస్తారు. అనగా నాగచైతన్య కి మనవడుగా ఎఎన్ఆర్ కనిపిస్తారు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో చాలా తెలివిగా ఈ సినిమా కథని తయారు చేసారు.

చాలా ఆసక్తి కరంగా ఉన్న ఈ మూవీని ‘బ్యాక్ టు ఫ్యూచర్’ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని రాసుకున్నారు. విక్రం కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకి హర్షవర్ధన్ డైలాగ్స్ రాస్తున్నాడు.

సంబంధిత సమాచారం :