“బాలన్ – ది బాయ్” సినిమాపై అక్కినేని హీరో రివ్యూ వైరల్!

“బాలన్ – ది బాయ్” సినిమాపై అక్కినేని హీరో రివ్యూ వైరల్!

Published on Jun 18, 2026 11:05 PM IST

పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడు రిలీజ్ కి దగ్గరలో ఉన్న “బాలన్ – ది బాయ్” సినిమా పలువురు సెలబ్రిటీల ప్రశంసలు దక్కించుకుంటోంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఇలాంటి సినిమా గత రెండేళ్లలో రాలేదని అభినందించగా..ఇప్పుడు అక్కినేని హీరో నాగచైతన్య “బాలన్ – ది బాయ్” సినిమాను అప్రిషియేట్ చేశారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ మూవీ ఫీల్ లోనే ఉండిపోయానని, “బాలన్ – ది బాయ్” సినిమా మర్చిపోలేని అనుభూతికి గురిచేసిందని అన్నారు. నాగచైతన్య ప్రశంసలతో మూవీ లవర్స్ లో ఈ సినిమాపై బజ్ మరింత పెరిగింది.

“బాలన్ – ది బాయ్” సినిమా చూసిన తర్వాత నాగచైతన్య స్పందిస్తూ.. “ఈ సినిమా సరికొత్త కథ, ఆశ్చర్యపరిచే కథనం, చూపు తిప్పుకోలేని చిత్రీకరణతో ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఊహకు అందకుండా సాగుతూ ఆశ్చర్యపరిచింది. ఎండ్ టైటిల్స్ తర్వాత కూడా నేను అదే ఫీల్ లో ఉండిపోయాను. ఈ సినిమా ఇచ్చిన అనుభూతి నుంచి బయటకురాలేకపోయా. జితూ మాధవన్ స్క్రిప్ట్ ఇంప్రెస్ చేసింది. ఆయన “మంజుమ్మల్ బాయ్స్”, “ఆవేశం” సినిమాల్లాగే ఈ చిత్రాన్ని కూడా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు” అన్నారు.

గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా “బాలన్ – ది బాయ్” సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో “మంజుమ్మల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా ఈ జూన్ నెల 19న హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “బాలన్ – ది బాయ్” సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు