“చై” తో పని చేయడం కోసం ఎదురు చూస్తున్న నాగార్జున!

Published on Aug 29, 2021 5:20 pm IST

అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నా అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ఆరోగ్యం మరియు సంతోషం గా ఉండాలని నాగ చైతన్య కోరుకున్నారు. మీలా ఉన్నందుకు చాలా థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు.

అక్కినేని నాగ చైతన్య చేసిన వ్యాఖ్యల కి అక్కినేని నాగార్జున స్పందించారు. థాంక్ యూ రా చై అంటూ చెప్పుకొచ్చారు.నీతో మళ్ళీ కలిసి నటించడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇది చాలా ఫన్ కలిగి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. నాగ చైతన్య మరియు అక్కినేని నాగార్జున ఇద్దరు కూడా బంగార్రాజు చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఇందుకు సంబంధించిన పోస్టర్ సైతం విడుదల అయింది. బంగార్రాజు చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :