అమలాపాల్ న్యూడ్ టీజర్ పై సమంత రియాక్షన్…!

Published on Jun 19, 2019 8:15 am IST

నటి అమలా పాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు రత్న కుమార్ తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ “ఆడై”. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ నిన్న విడుదలైన టీజర్ తో అంచనాలు భారీగా ఏర్పడేలా చేశారు. ఒకటిన్నర నిమిషాల టీజర్ ఆసక్తికరంగా ఉంది. టీజర్ లో ఓ షాట్లో పూర్తిగా నగ్నంగా కనిపించి అమలాపాల్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. పాత్ర డిమాండ్ కొరకు అమలాపాల్ ఎటువంటి సన్నివేశాలలోనైనా నటించడానికి వెనుకాడరని నిరూపించుకుంది.

ఈ టీజర్ కు సినీ ప్రముఖుల నుండి అలాగే,ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. మరో విశేషం ఏమిటంటే అక్కినేని సమంత ఈ టీజర్ పై తన స్పందన తెలియజేశారు. “ఆడై” టీజర్ ప్రేక్షకులకు అత్యంత ఉత్కంఠ కలింగించేలా, అద్భుతంగా ఉంది, బెస్ట్ విషెస్ టు అమలాపాల్, సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది. వి స్టూడియోస్ బ్యానర్ పై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ మూవీ కి ప్రదీప్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More