ముగిసిన మనం సినిమా మొదటి షెడ్యూల్

Published on Jun 22, 2013 11:02 pm IST

manam_telugu_movie

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున మరియు నాగ చైతన్య నటిస్తున్న ‘మనం’ సినిమా ఈ మధ్య సినీవార్తలలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. సమంత మరియు శ్రియ శరన్ హీరోయిన్స్. ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్లో నిన్నటితో ముగించుకుంది. జూలై రెండో వారం నుండి రెండో షెడ్యూల్ మొదలుకానుంది.

‘ఇష్క్’ సినిమా తీసిన విక్రమ్ కుమార్ ఈ సినిమా దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు హర్షవర్ధన్ డైలాగులు రాస్తున్నాడు. ఈ సినిమా కామెడి ప్రధానంగా సాగుతుందని వినికిడి.

సంబంధిత సమాచారం :