మన్మథడు 2 లో కన్నడ హాట్ బ్యూటీ !

Published on Apr 28, 2019 12:45 pm IST

కింగ్ నాగార్జున , ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మన్మథుడు 2. సూపర్ హిట్ మూవీ మన్మథుడు కి సీక్వెల్ గా రూపొందతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లో జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనుంది. తెలుగులో ఆమె కు ఇదే మొదటి చిత్రం. త్వరలోనే పోర్చుగల్ వెళ్లి షూటింగ్ లో జాయిన్ కానుంది అక్షర.

ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతంఅందిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఈచిత్రాన్ని దసరా బరిలో నిలుపేలా ప్లాన్ చేస్తున్నాడు నాగ్.

సంబంధిత సమాచారం :