మే లో రానున్న అక్షర !

మే లో రానున్న అక్షర !

Published on Feb 20, 2019 7:47 PM IST

కన్నడ బ్యూటీ నందిత శ్వేత ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్ల తో ఫుల్ బిజీ గా వుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అక్షర’. సప్సెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో నందిత తో పాటు ప్రముఖ కమెడియన్లు షకలక శంకర్ , సత్య , మధు నందన్ పాల్గొంటున్నారు. వీరి కలయికలో వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉండనున్నాయట.

బి. చిన్నికృష్ణ తెరకెక్కిస్తున్నఈచిత్రంలో నందిత ఫిజిక్స్ లెక్చరర్ గా కనిపించనున్నారు. అహితేజ బెల్లంకొండ, సురేష్ అల్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు