కోటి రూపాయలు డోనేట్ చేసిన స్టార్ హీరో

Published on Jun 18, 2021 7:02 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సామాజిక సేవలో ఎప్పుడూ ముందే ఉంటారు. తాను ఉన్నచోట సమస్య ఉంది అంటే వెంటనే స్పందిస్తారు ఆయన. అలా స్పందించి చేయూతను అందించిన సందర్భాలు అనేకం. తాజాగా కూడ అలాంటి పనే ఒకటి చేశారు ఆయన. నిన్న జూన్17న అక్షయ్ బీఎస్ఎఫ్ జవాన్లను కలవడానికి జమ్మూ కాశ్మీర్ వెళ్లడం జరిగింది. అక్కడ సైనికులను కలిసి సరదాగా గడిపిన ఆయన అక్కడితో వెనుదిరగలేదు. జమ్మూ కాశ్మీర్ నందు ఉన్న మారుమూల గ్రామాలను సందర్శించారు.

ఆ సందర్శనలో భాగంగానే నీరు అనే కుగ్రామానికి వెళ్లిన ఆయన అక్కడ సరైన పాఠశాల భవనం లేదని తెలుసుకుని కొత్త భవనం నిర్మాణానికి వెంటనే కోటి రూపాయల విరాళం ఇచ్చారు. అక్షయ్ కుమార్ చేసిన ఈ సహాయానికి అందరూ ఆయన్ను అభినందిస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’ జాలై 27న విడుదలకానుంది. ఇది కాకుండా రోహిత్ శెట్టి చేసిన ‘సూర్యవన్షి’ సినిమా కూడ విడుదలకు రెడీ అవుతోంది. ఇవి రెండూ కాకుండా పృథ్విరాజ్, బచ్చన్ పాండే, ఆత్రంగి రే’ లాంటి సినిమాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :