వరుసగా 6 సినిమాలు విడుదల చేయనున్న స్టార్ హీరో

Published on Jan 30, 2020 10:39 pm IST

ఒక స్టార్ హీరో ఏడాదిన్నర వ్యవధిలో 6సినిమాలు విడుదల చేయనున్నాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. సాధారణంగా ఏ హీరో అయినా ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు చేస్తారు. ఇక స్టార్ హీరోలు ఐతే సంవత్సరానికి ఒకటి మహా అయితే రెండు సినిమాల కంటే ఎక్కువ చేయలేరు. అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వచ్చే 15నెలల కాలంలో ఏకంగా 6 సినిమాలు విడుదల చేయనున్నాడు.రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సూర్యవంశీ ఈఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న విడుదల కానుంది. ఆ తదుపరి కాంచన తెలుగు రీమేక్ గా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీ బాంబ్ మే 22న విడుదల అవుతుంది.

2020లో చివరిగా భారీ పీరియాడిక్ మూవీ పృథ్విరాజ్ అనే చిత్రం 13నవంబర్ న విడుదల కానుంది. దీనికి చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. ఇక 2021 ప్రారంభంలో ఫర్హాద్ సామ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బచ్చన్ పాండే జనవరి 22న విడుదల అవుతుంది. ఇక ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో సారా అలీఖాన్, ధనుష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కనున్న అట్రాంగి రే ఫిబ్రవరి 2న చివరిగా జయ తీర్థ దర్శకత్వం వహించనున్న బెల్ బాటమ్ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న విడుదల అవుతుంది. ఇలా అక్షయ్ కుమార్ రానున్న పదిహేను నెలలో ఆరు సినిమాలు విడుదలకు సిద్ధం చేశారు.

సంబంధిత సమాచారం :