ఐకానిక్ షోతో భారీ రికార్డులు సెట్ చేసిన అక్షయ్.!

Published on Sep 25, 2020 9:00 am IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మన తెలుగు ఆడియెన్స్ కు కూడా చాలా మందికి తెలుసు. తన సినిమాలు మన దగ్గర విడుదల కానప్పటికీ దాదాపు అందరికీ ఈ టాప్ హీరో సుపరిచితుడే.. అయితే మన దేశంలోనే టాప్ ఛానెల్స్ లో ఒకటైన డిస్కవరీ ఛానెల్ లో ఫేమస్ షో “మ్యాన్ వర్సెస్ వైల్డ్” హోస్ట్ బేర్ గ్రిల్స్ తో “ఇంటూ ది వైల్డ్” అనే మరో ఐకానిక్ అండ్ సెన్సేషనల్ షోను ప్లాన్ చేసారు, ఇందులో పలు దేశాలకు చెందిన అగ్ర గాములతో సాహస యాత్ర చేయిస్తారు.

అలా మన దేశంలో ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ ఇపుడు అక్షయ్ కుమార్ లతో మాత్రమే ఈ షోను ప్లాన్ చేసారు. ఇప్పటికే మోడీ మరియు తలైవర్ రజినీ కాంత్ లతో భారీ రికార్డులు నెలకొనగా అంతే స్థాయిలో అక్షయ్ తో ప్లాన్ చేసిన ఎపిసోడ్ కు కూడా రెస్పాన్స్ వచ్చినట్టు డిస్కవరీ ఛానెల్ ఇండియా వారు తెలుపుతున్నారు.

ఈ షో ఈ ఏడాదిలో మన దేశంలోనే అత్యధికంగా వీక్షించడింది అట, అలాగే ఈ సెప్టెంబర్ 14 న టెలికాస్ట్ చేసిన ప్రీమియర్ ఎపిసోడ్ ను 1.1 కోటి మంది వీక్షించడమే కాకుండా మొత్తం అదే వారంలో రిపీటెడ్ ఎపిసోడ్స్ తో కలిపి 2.6 కోట్ల మంది చూసారని తెలిపారు. అంతే కాకుండా ఈ ప్రీమియర్ కు ఇండియన్ డిస్కోవరీ ఛానెల్ హిస్టరీ లోనే రెండో అత్యధిక టీఆర్పీ ను రాబట్టి అక్షయ్ భారీ రికార్డులు నెలకొల్పాడని వారు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More