కల్కి 2 పై అదిరిపోయే అప్డేట్.. ఇక షురూ..!

కల్కి 2 పై అదిరిపోయే అప్డేట్.. ఇక షురూ..!

Published on Feb 21, 2026 8:02 AM IST

Kalki

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) చిత్రానికి సీక్వెల్ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కుతున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేయడంతో, నేటి నుండి ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలోని శంకర్ పల్లిలో ఉన్న ఒక భారీ స్టూడియోలో, దేశంలోనే అతిపెద్ద సెట్స్‌లో ఒకదానిని చిత్ర బృందం సిద్ధం చేసింది.

​బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ మరియు అమితాబ్ మధ్య వచ్చే అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రభాస్ పది రోజుల సమయాన్ని కేటాయించారు. అలాగే, ఈ సీక్వెల్‌లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం నేచురల్ యాక్ట్రెస్ సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమెపై లుక్ టెస్ట్ కూడా నిర్వహించారని, త్వరలోనే ఆమె రాకపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

​వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలలో రూపొందుతున్న ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ప్రభాస్ ఒకవైపు ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన గ్లోబల్ ప్రాజెక్ట్ అయిన ‘కల్కి’ (Kalki) సీక్వెల్‌కు ప్రాధాన్యత ఇస్తూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ అప్‌డేట్‌తో ప్రభాస్ అభిమానుల్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు