తమిళంలో మాట్లాడి నవ్వించిన అక్షయ్ కుమార్ !

తమిళంలో మాట్లాడి నవ్వించిన అక్షయ్ కుమార్ !

Published on Nov 3, 2018 1:03 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ తమిళంలో మాట్లాడే ప్రయత్నం చేసి ప్రేక్షకులను నవ్వించారు. తమిళ భాష రాని వాళ్ళకి ఆ భాషలో మాట్లాడం కొద్దిగా కష్టంతో కూడుకొని ఉంటుంది. అయినా అక్షయ్ కుమార్ తమిళంలో మాట్లాడటం విశేషం.

కాగా అమీ జాక్సన్ కథానాయకిగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఏఅర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు , తమిళ ,హిందీ భాషల్లో నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల కానుంది. గ్రాఫిక్స్ కి అత్యంత విలువ ఇస్తూ, అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో.. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు