హెలికాఫ్టర్ పై ఆ హీరో సాహసాలు చుస్తే…ఒళ్ళుగగ్గురుపొడవాల్సిందే

Published on Jun 5, 2019 4:32 pm IST

ఇండియన్ సూపర్ స్టార్స్ లో సూపర్ ఫాస్ట్ గా సినిమాలు తీయాలంటే అక్షయ కుమార్ తరువాతే ఎవరైనా. గత సంవత్సరం పాడ్ మాన్,గోల్డ్,2.0, సింబా సినిమాలు విడుదల చేశారు. 2019 లో ఆల్రెడీ కేసరి మూవీతో అలరించిన ఈయన, మిషన్ మంగళ్,హౌస్ ఫుల్,గుడ్ న్యూస్ మూవీస్ ని వరుసలో పెట్టారు, ఇప్పుడు త్వరత్వరగా వీటిని పూర్తి చేసి పనిలో ఉన్నారు. ప్రతి సంవత్సరం మూడు సినిమాలకు తగ్గకుండా అక్షయ్ విడుదల చేస్తారు.

ఇవి కాక లారెన్స్ దర్శకత్వంలో రానున్న “లక్ష్మీ బాంబ్”,మరియు సూర్యవంశీ సినిమాలు 2020 కి రానున్నాయి. ఐతే సోషల్ మీడియాలో హెలికాఫ్టర్ పై చేస్తున్న సాహసోపేత స్టంట్ ఫొటో ఒకటి తన ట్విట్టర్ అకౌంట్ లో ఫ్యాన్స్ తో పంచుకున్నారు అక్షయ్. వేగంగా వెళుతున్న హెలికాఫ్టర్ నుండి క్రిందకి వేలాడుతూ బైక్ పై వెళుతున్న విలన్ ని వేటాడుతన్న అక్షయ్ ఫొటో సూపర్ గా ఉంది. ఈ సాహసోపేతమైన స్టంట్ అక్షయ్ “సూర్యవంశీ” మూవీ కొరకు చేశారట. ఐతే తన ఫ్యాన్స్ ని ఆలా చేయొద్దని హెచ్చరించాడు ఈ హీరో పనిలోపనిగా.

సంబంధిత సమాచారం :

More