ప్లాప్ టాక్ లో కూడా 150 కోట్లు కొట్టాడే.

ప్లాప్ టాక్ లో కూడా 150 కోట్లు కొట్టాడే.

Published on Nov 2, 2019 6:11 PM IST

housefull4

బాలీవుడ్ క్రేజీ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ హౌస్ ఫుల్ 4 గతవారం దీపావళి కానుకగా విడుదలైంది. సక్సెస్ ఫుల్ ‘హౌస్ ఫుల్’ మూవీ ఫ్రాంచైజీలో నాలుగవ భాగంగా వచ్చిన ఈ చిత్రం దారుణమైన రివ్యూస్ పొదింది. క్రిటిక్స్ ఈ చిత్రాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. రివ్యూస్ ఎలా ఉన్నా హౌస్ ఫుల్ 4 మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150కోట్ల వసూళ్లకు చేరువైనట్లు సమాచారం. విడుదలైన ఎనిమిది రోజులకు గాను ఈ చిత్రం దాదాపు 149.36 కోట్ల వసూళ్లు అందుకుంది.

దారుణమైన ప్లాప్ టాక్ తెచ్చుకొని కూడా ఈ స్థాయి వసూళ్లు సాధించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అక్షయ్ తో పాటుగా,రానా, రితేష్ దేశ్ ముఖ్, బాబీ డియోల్, కృతి సనన్, పూజా హెగ్డే, కృతి కర్బంద వంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో నటించడం విశేషం. దర్శకుడు ఫర్హాద్ సాంజి హౌస్ ఫుల్ 4 చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్షయ్ గత చిత్రం మిషన్ మంగళ్ కూడా రెండు వందలకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు