వైరల్ అవుతోన్న తమన్ మ్యూజిక్ ప్రోమో !

Published on Jul 5, 2021 2:00 pm IST

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు మణిశర్మ, దేవీశ్రీప్రసాద్ లాంటి వారు అమెరికాలో షోస్ చేశారు. తాజాగా మ్యూజిక్ సంచలనం తమన్ కూడా ఓ షో చేయబోతున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా ఈవెంట్లు అన్ని మరుగున పడ్డాయి. కానీ కరోనా రెండో దశ తర్వాత అమెరికాలో దాదాపు కరోనా ప్రభావం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ తమన్ తో మ్యూజిక్ మొదలైంది. అక్కడ భారీ షోలకు కూడా జనం బారులు తీరి వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ షోకి సంబంధించిన ప్రోమోను హీరో అల్లు అర్జున్ రిలీజ్ చేయడం విశేషం. ఓ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ ప్రోమో వీడియో చాల బాగుంది. అయితే ఈ ప్రోమో బాగా రావడానికి త్రివిక్రమ్ మెయిన్ రీజన్ అట. ప్రోమో కట్ కు బేసిక్ ఐడియా దగ్గర నుండి షాట్ మేకింగ్ వరకూ త్రివిక్రమ్ ఇన్ ఫుట్స్ చాల ఉన్నాయని టాక్. ఇక శివమణి డ్రమ్స్, సింగర్ హారిక, తమన్ తో పాటు మిగిలిన మ్యూజిక్ బృందం కూడా ఈ వీడియోలో హైలైట్ అయ్యారు.

సంబంధిత సమాచారం :