మరో భారీ రికార్డు కొట్టిన అల్లు అర్జున్..!

Published on Aug 8, 2020 1:45 pm IST

అల వైకుంఠపురంలో మూవీ సంచనాలు కొనసాగుతున్నాయి. ఈ మూవీ సాంగ్స్ జియో సావన్ లో ఏకంగా 200 మిలియన్ ప్లేస్ దక్కించుకొని రికార్డు రేపాయి. ఓ ప్రాంతీయ భాషా చిత్ర సాంగ్స్ కి ఈస్థాయిలో ఆదరణ దక్కడం విశేషం. 200 మిలియన్ ప్లేస్ అంటే సాధరన విషయం కాదు. అంటే జియో సావన్ లో ఇప్పటి వరకు 20 కోట్ల సార్లు ఈ మూవీ పాటలు విన్నారని అర్థం. చాలా కాలం తరువాత థమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. అల వైకుంఠపురంలో మూవీ విజయంలో ఆయన సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. ఆ సినిమాలోని సాంగ్స్ మొత్తం ఆదరణ దక్కించుకోవడం విశేషం.

దర్శకుడు త్రివిక్రమ్- బన్నీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అల వైకుంఠపురంలో మూవీ భారీ విజయం అందుకుంది. బన్నీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వాసులు చేసిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేయడం విశేషం. ఈ మూవీలో బన్నీకి జంటగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :

More