“అల వైకుంఠపురములో” ఎఫెక్ట్ పై ఓపెన్ అయ్యిన హిందీ నిర్మాత.!

Published on Jan 19, 2022 6:38 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన రీసెంట్ బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా “పుష్ప” తో హిందీలో తన క్రేజ్ పట్ల అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అక్కడ జనం తన సినిమాలు కేవలం బుల్లితెర మొబైల్ స్క్రీన్స్ లోనే కాదు థియేటర్స్ లో కూడా వచ్చి చూస్తారని ప్రూవ్ చేసింది. అయితే దీనితో బన్నీ నటించిన మరో లేటెస్ట్ అండ్ హిట్ సినిమా అయినటువంటి “అల వైకుంఠపురములో” ని హిందీలో డబ్ చేసి థియేటర్స్ లో రీలీజ్ చెయ్యడానికి అక్కడి నిర్మాత మనీష్ షా సిద్ధం అయ్యారు.

ఈ నెల 26న థియేటర్స్ లో ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చెయ్యడానికి సిద్ధం చేస్తుండగా ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఈ సినిమా దగ్గర లేవనెత్తింది. అదేమిటంటే ఈ చిత్రం తాలూకా రీమేక్ హక్కులు ఆల్రెడీ బాలీవుడ్ వర్గాలు కొనుగోలు చేసాయి పైగా అక్కడి యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ “షెహ్ జాదా” అనే టైటిల్ ని పెట్టి రిలీజ్ కి కూడా డేట్ ఫిక్స్ చేశారు.

అలాంటప్పుడు డైరెక్ట్ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ పట్ల కాస్త ఆసక్తి ఏర్పడింది. దీనితో ఈ రెండు సినిమాలు ముఖ్యంగా ఒరిజినల్ అల వైకుంఠపురములో రిలీజ్ వల్ల హిందీ రీమేక్ సినిమాకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనే దానిపై నిర్మాత మనీష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.

కార్తీక్ ఆర్యన్ సినిమా భారీ స్కేల్ లో తెరకెక్కుతుంది అని దానికి ఎలాంటి ప్రభావం ఉండదని, ఇప్పుడు హిందీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏవి లేవని, ముఖ్యంగా ఈ జనవరి 26కి లేవని అందుకే ఆ డేట్ ని అల వైకుంఠపురములో హిందీ డబ్ ని రిలీజ్ చెయ్యాలనుకున్నానని బాలీవుడ్ మీడియాలో తెలిపాడు. దీనితో ఈ రిలీజ్, రీమేక్ లపై ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :