అక్కడ “RRR” బిగ్గెస్ట్ ఈవెంట్ పై అలర్ట్స్.!

Published on Dec 17, 2021 2:00 pm IST

పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీగా ఉన్న మరి బిగ్గెస్ట్ సౌత్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా అజయ్ దేవగన్, అలియా భట్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించారు.

మరి రీసెంట్ గా ట్రైలర్ తో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లిన ఈ చిత్రం ప్రమోషన్స్ కానీ ఇతర ఇతర ఈవెంట్స్ కానీ పక్కా ప్లానింగ్ ప్రకారం ఇప్పుడు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ ఈ సినిమా హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గాను సాలిడ్ ప్లానింగ్ లు జరుగుతున్నాయి. మరి దీనిపైనే చిత్ర యూనిట్ కూడా అలర్ట్స్ వేస్తున్నారు.

వచ్చే డిసెంబర్ 19 న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరుగనుందట. అలాగే ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ కి గాను చాలా మంది ప్రముఖులే బాలీవుడ్ నుంచి రాబోతున్నట్టుగా టాక్ ఉంది. ప్రస్తుతానికి అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఈవెంట్ కి హాజరవుతాడని బజ్ ఉంది. ఇక దీనిపై కూడా ఒక అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :