విజయ్ దేవరకొండపై మరొక బాలీవుడ్ హీరోయిన్ ప్రసంశలు

Published on Dec 4, 2019 4:06 pm IST

విజయ్ దేవరకొండ నటనతోనే కాదు స్టైల్ పరంగా కూడా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్ ట్రై చేస్తూ ఇంతకుముందెన్నడూ ఏ తెలుగు హీరో కనిపించని విధంగా కనిపిస్తూ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టాడు. ఈ కుర్ర హీరో క్రేజ్ తెలుగులోనే కాదు బాలీవుడ్లో కూడా గట్టిగానే కనిపిస్తోంది. అది కూడా అక్కడి స్టార్ హీరోయిన్లలో కావడం విశేషం.

కొన్ని నెలల క్రితమే కైరా అద్వానీ తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని పదే పదే చెప్పి అతన్ని కలిసి తెగ మురిసిపోగా ఇప్పుడు మరొక స్టార్ నటి అలియా భట్ సైతం విజయ్ తన ఫేవరెట్ అంటోంది. ఫిల్మ్ ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ వేడుకలో మీకు ఈ యేడాదిలో బాగా నచ్చిన మోస్ట్ గ్లామరస్ స్టార్స్ ఎవరని అడగ్గా దానికి సమాధానం చెబుతూ తనకిష్టమైన గ్లామర్ నటి అనుష్క శర్మ అని నటుడు విజయ్ దేవరకొండ అంది. సో.. స్టైల్ పరంగా మన హీరో క్రేజ్ బాలీవుడ్ పరిశ్రమను గట్టిగానే తాకిందన్నమాట.

సంబంధిత సమాచారం :

More