“RRR” కోసం ప్లాన్ సిద్ధం చేసుకున్న ఆలియా.!

Published on Jun 16, 2021 7:02 pm IST

ఇండియన్ మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ లలో ఒకటైన “RRR” చిత్రంపై బ్యాలన్స్ షూట్ పై లేటెస్ట్ గానే ఈ చిత్రం నిర్మాత డివివి దానయ్య క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం పై లేటెస్ట్ ఇన్ఫో మరొకటి బయటకి వచ్చింది. ఈ చిత్రంలో సాలిడ్ రోల్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పై తెలుస్తుంది.

తాను ప్రస్తుతం బాలీవుడ్ లో చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్ “గంగూభాయ్ ఖతియవాది” షూట్ లో కేవలం రెండు రోజులు పాల్గొనాల్సి ఉండగా అది కాస్త ఈ నెలలోనే కంప్లీట్ చేసేయ్యనుండగా దాని అనంతరం వెంటనే RRR షూట్ లో జూలై మొదటి వారం నుంచి పాల్గొననుందట. చరణ్ చేస్తున్న అల్లూరి పాత్ర సరసన సీతగా నటిస్తున్న ఆలియా సినిమాలో సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపిస్తుంది అని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ భారీ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :