ట్రైలర్ టాక్ : ఆల్ఫా – యాక్షన్‌తో అదరగొట్టిన ఆలియా-శార్వరి.. సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారుగా..!

ట్రైలర్ టాక్ : ఆల్ఫా – యాక్షన్‌తో అదరగొట్టిన ఆలియా-శార్వరి.. సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారుగా..!

Published on Jun 17, 2026 2:00 PM IST

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నుంచి వస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

YRF స్పై యూనివర్స్ నుండి వస్తున్న తొలి లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడంతో ఈ మూవీ ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్‌తో ఆకట్టుకునేలా కట్ చేశారు. ఆలియా పవర్‌ఫుల్ స్టంట్స్‌కు శార్వరి కూడా తోడవ్వడంతో ఈ ఇద్దరు భామలు చేసే యాక్షన్ సిల్వర్ స్క్రీన్‌పై ఫైర్ పుట్టించేలా ఉండనుంది. అటు బాబీ డియోల్ విలనిజంతో పాటు సర్‌ప్రైజ్ క్యామియోగా స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా మెరవనున్నాడు. మొత్తానికి ఈ ట్రైలర్‌తో ఒక్కసారిగా ఆల్ఫా మూవీ అంచనాలు పెంచేసింది.

రోహన్ష్-అబీర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శివ్ రావల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని జూలై 3న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు