ఆ స్పెషల్ ఎపిసోడ్‌ను మోహన్ బాబుతో ప్లాన్ చేసిన ఆలీ..!

Published on Sep 22, 2021 1:34 am IST


ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ప్రతి వారం ఎవరో ఒకరు సెలబ్రెటీలు వస్తూనే ఉంటారు. అయితే ఆలీ షోకు వచ్చిన సెలబ్రెటీల విశేషాలు, విషయాలను అడిగి తెలుసుకుంటూ, వారి లైఫ్‌లోని పలు జ్ణాపకాలను గుర్తు చేస్తూనే, మరో పక్క తనదైన స్టెయిల్‌లో సెలబ్రెటీలకు ప్రశ్నలు వేస్తూ కామెడీనీ పుట్టించి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంటాడు. అయితే ఈ కార్యక్రమం 250వ ఎపిసోడ్‌కి చేరుకుంది.

అయితే ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు యాక్షన్ కింగ్ మోహన్ బాబు రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. కంఠం కంచు ఇంటి పేరు మంచు, విలన్‌గా 400కి పైగా చిత్రాలు, హీరోగా 150కి పైగా చిత్రాలు నిర్మాతగా 60కి పైగా చిత్రాలు, విద్యావేత్తగా కీర్తి ప్రతిష్టలు, రాజకీయవేత్తగా లబ్ధప్రతిష్టులు అంటూ మోహన్‌ బాబు ఎంట్రీని చూపించిన తీరు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఆలీతో సరదాగా అతి త్వరలో.. ఈటీవీలో అంటూ తనదైన శైలిలో మోహన్ బాబు చెప్పడం కూడా ఆకట్టుకుంటుంది. మరీ ఈ ఎపిసోడ్‌లో మోహన్ బాబు ఎలాంటి సరదా సంగతులను ఆలీతో పంచుకోబోతున్నాడో తెలియాలంటే మరికొద్ది ఆగాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :