ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో పవర్ ఫుల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. ఈ చిత్రం అనౌన్స్ చెయ్యడంతో దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున అటెన్షన్ ను సంతరించుకుంది.
శరవేగంగా పూర్తి కానున్న ఈ చిత్రంపై ఇప్పుడు అభిమానులు ఓ అంశంపై ఆరా తీస్తున్నారు. అసలు ఈ సినిమా టైటిల్ అర్ధం ఏమిటి అని ఆలోచించగా దర్శకుడు నీల్ రివీల్ చేసారు. సలార్ అంటే ఒక రాజుకు రైట్ హ్యాండ్ అని చెప్పాడు. అంటే ప్రభాస్ ను మించిన పవర్ ఫుల్ రోల్ ఈ చిత్రంలో ఉందా?
అతడికి ప్రభాస్ విధేయుడిగా ఉంటాడా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ కింగ్ రోల్ సినిమాలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మోస్ట్ వైలెంట్ మెన్ అండ్ పవర్ ఫుల్ మాఫియా డాన్ లా ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ అదిరిపోయే రేంజ్ లో చూపించడం ఖాయం అయ్యింది. మరి ఈ కాంబో ఎంతటి సెన్సేషన్ ను నమోదు చేస్తుందో చూడాలి.


