ఈ టాలెంటెడ్ డైరెక్టర్ అనౌన్స్మెంట్ పై ఉత్కంఠ.!

Published on Sep 16, 2020 10:42 am IST

కోలీవుడ్ స్థార్ హీరో కార్తీ తో తీసిన “ఖైదీ” చిత్రంతో మన టాలీవుడ్ లో కూడా ఒక్క సారిగా వెలుగులోకి వచ్చిన దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్. కేవలం మూడు చిత్రాలతోనే అక్కడ స్టార్ డైరెక్టర్ హోదా లోకి వచ్చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ లేటెస్ట్ గా తీసిన “మాస్టర్” చిత్రంపై అయితే అక్కడ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇళయ థలపతి విజయ్ తో తీసిన ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రం తర్వాత ఈ దర్శకుడు ఏ హీరోతో చేస్తాడు? ఎలాంటి సినిమా చేస్తాడు అన్నది అటు కోలీవుడ్ మరియు మన టాలీవుడ్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా నిలిచింది.ఎందుకంటే ఈ దర్శకుడు ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రంని కూడా చేస్తాడని టాక్ వినిపించింది. దీనితో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ దర్శకుని నుంచి ఒక అధికారిక అనౌన్స్మెంట్ కోసం అటు కోలీవుడ్ మరియు మన టాలీవుడ్ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More