ఆ అప్డేట్ ఎన్టీఆర్ సినిమా నుంచే అని ఫిక్సయిపోయారు.!

Published on Jun 14, 2021 2:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.. మరి అలాగే ఈ చిత్రం అనంతరం కూడా సాలిడ్ లైనప్ ను తారక్ ఫిక్స్ చేసుకున్నాడు. అయితే వాటిలో తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేసిన రెండో సినిమా కూడా ఉంది. అయితే ఇపుడు ఈ సినిమాపైనే రచ్చ నడుస్తుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఫిక్స్ అయ్యిందని తెలియడం.. అలాగే నిన్ననే కియారా కూడా సౌత్ ఇండియన్ సినిమా పై తన నుంచి కొత్త అనౌన్సమెంట్ ఉందని చెప్పడంతో ఇక అది కాస్తా ఆల్ మోస్ట్ ఎన్టీఆర్ తో సినిమాపై అప్డేట్ నే అయ్యుంటుంది అని అభిమానులు ఫిక్స్ అయ్యిపోయారు. అలాగే మరో పక్క సినీ వర్గాల నుంచి కూడా అదే అప్డేట్ రానుంది అని స్ట్రాంగ్ బజ్ కూడా ఉంది. మరి ఈ అధికారిక అప్డేట్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :