భీం ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.!

Published on May 19, 2021 12:24 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లో తారక్ కు కోవిడ్ పాజిటివ్ కూడా వచ్చింది. పైగా తారక్ పుట్టినరోజు కూడా దగ్గరకు వచ్చేసింది. దీనితో RRR నుంచి రావాల్సిన ట్రీట్ వస్తుందా లేదా అని తారక్ ఫ్యాన్స్ అంతా కొంత కాలం నుంచి ఎదురు చూస్తున్నారు.

అయితే స్పెషల్ పోస్టర్ ఆల్రెడీ రెడీ అయినా చిత్ర యూనిట్ నుంచి ఒక అధికారిక క్లారిటీ వస్తే అదొక భరోసా లా భావిస్తున్నారు. మరి అలా ఆ మాస్ అనౌన్సమెంట్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అది కాస్తా ఈరోజు ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే తారక్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్స్ తో హంగామా చేస్తుండగా వారిని తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని తారక్ సూచించారు.

సంబంధిత సమాచారం :