“టక్ జగదీష్” ఇంపార్టెంట్ అప్డేట్ కోసం వెయిటింగ్.?

Published on Aug 10, 2021 4:15 pm IST


ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రాల్లో “టక్ జగదీష్” ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.. తన హిట్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు సహా టాలీవుడ్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

లాక్ డౌన్ 2.0 అనంతరం ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు వస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. కానీ టికెట్ రేట్స్ అంశం ఇతర అంశాల మూలాన ఓటిటి కే ఈ సినిమా వెళ్ళింది అని బజ్ మళ్ళీ మొదలయ్యింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది దీనితో మేకర్స్ ఈ థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ చిత్రం ఓటిటి డీల్ ఆల్రెడీ ప్రైమ్ వీడియోతో క్లోజ్ అయ్యినా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్న సినిమాలకు వస్తున్న ఆదరణ నిమిత్తం ఓటిటి రిలీజ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టుగా నయా గాసిప్. అయితే ఇది వినడానికి ఇంపుగా ఉంది కానీ ఈ ఇంపార్టెంట్ మ్యాటర్ పై ఒక అధికారిక అప్డేట్ కోసం అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మేకర్స్ నుంచి ఈ సస్పెన్స్ పై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :