“సలార్”..ఈ అధికారిక ప్రకటన కోసమే వెయిటింగ్.!

Published on Jan 28, 2021 8:00 am IST

లేటెస్ట్ గా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నుంచి బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ “సలార్”. స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ సినిమా ఆ ప్రకటనతోనే హైప్ తెచ్చేసుకుంది. ఇక అక్కడ నుంచి ఈ చిత్రానికి అంతకంతకూ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తోనే మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి అంతా కూడా ఒక అధికారిక ప్రకటన కోసమే ఎదురు చూస్తున్నారు. అదే ఈ సినిమా హీరోయిన్ కోసం. ఇప్పుడున్న స్ట్రాంగ్ బజ్ ప్రకారం శృతి హాసన్ హీరోయిన్ గానే చేస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ అనౌన్సమెంట్ కోసమే ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపటి నుంచే షూట్ స్టార్ట్ కానున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసనే నటిస్తుందా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More