తారక్ మాస్ విట్నెస్ కోసమే అంతా వెయిటింగ్.!

తారక్ మాస్ విట్నెస్ కోసమే అంతా వెయిటింగ్.!

Published on Oct 21, 2020 11:04 AM IST

పెద్ద పెద్ద సినిమాల అప్డేట్స్ తో చాలా కాలం తర్వాత ఒక్క తెలుగు సినిమాలోనే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా అంతా సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మొదటగా రానున్న మోస్ట్ అవైటెడ్ అండ్ బిగ్గెస్ట్ అప్డేట్ RRR సినిమా నుంచి ఉంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ ఇది.

అత్యున్నత ప్రామాణికాలతో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం నుంచి అల్లూరిగా చరణ్ టీజర్ వచ్చేసింది. ఇప్పుడు కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ విట్నెస్ అంటే ఏంటో రుచి చూస్తారని తారక్ అభిమానులు ముందే కాలర్ ఎగరేసి చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే RRR టీం కూడా అలెర్ట్ చేస్తున్నారు.

అల్లూరి టీజర్ లో తారక్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కే నార్త్ ఆడియెన్స్ మరియు ఇతర సినీ ఇండస్ట్రీలలో కూడా భీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా విజువల్ ట్రీట్ వస్తుండడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ అందుకు సిద్ధంగా ఉండమని గర్వంగా చెబుతున్నారు. మొత్తానికి మాత్రం ఈ మాస్ విట్నెస్ అంతా అలా వ్యాపించి ఉంది. మరి ఆ విట్నెస్ కోసం ఇంకొక్క రోజు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు