నూతనోత్సాహంలో పవన్ అభిమానులు !

పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఇంకొక్క రోజు వ్యవథిలో రిలీజ్ కానుంది. దీంతో అభిమానుల్లో సందడి మొదలైంది. 9వ తేదీ అర్థరాత్రి నుండే ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్ల మిడ్ నైట్ షోలను ఏర్పాటుచేశారు అభిమానులు. ఇక తెలంగాణాలో అయితే షోలు ఉంటాయంటున్నారు కానీ ఇంకా సమయం ఫిక్స్ కాలేదు.

ఇప్పటికే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తార స్థాయిలో ఊపందుకుని, టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రేక్షకుల్లో. రిలీజవుతున్న థియేటర్ల సంఖ్య చూస్తుంటే సినిమాకు అనుకున్న దానికన్నా భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.