హిట్-3’.. అందరి చూపులు దీనిపైనే!

హిట్-3’.. అందరి చూపులు దీనిపైనే!

Published on Apr 18, 2025 7:03 AM IST

టాలీవుడ్‌లో ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్ చిత్రాలు కొన్ని మాత్రమే వచ్చాయి. ‘సంక్రాంతికి వస్తు్న్నాం’, ‘డాకు మహారాజ్’, ‘తండేల్’, ‘కోర్ట్’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర హిట్ చిత్రాలుగా నిలిచాయి. కానీ, బాక్సాఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవేమీ ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో థియేటర్లు బోసిపోయాయి.

అయితే, ఏప్రిల్ నెలలో కూడా ఈ డల్ మూమెంట్ కొనసాగుతోంది. సింగిల్ థియేటర్లు హౌజ్‌ఫుల్ బోర్డులు చూసి చాలా రోజులవుతుంది. ఇదే విషయాన్ని టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా చెబుతున్నారు. దీనికి కారణం సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేవనేది పలువురి అభిప్రాయం. అయితే, ఏప్రిల్ నెలలో కూడా పెద్దగా ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసిన సినిమాలు కనిపించడం లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఓదెల-2’ మిక్సిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ‘అర్జున్ S/O వైజయంతి’కి మంచి రిజల్ట్ లభిస్తే కొంతమేర థియేటర్లకు రిలీఫ్.

కానీ, పూర్తిస్థాయిలో థియేటర్లు జనాలతో నిండాలంటే సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ కావాల్సిందే. ఇలాంటి బజ్ క్రియేట్ చేసిన సినిమా ‘హిట్-3’ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. హీరో నాని కూడా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ కథలో దమ్ముంటేనే సినిమాను చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఒక్కటే థియేటర్లకు దిక్కు అయిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి నిజంగానే టాలీవుడ్ డల్ మూమెంట్‌కు ‘హిట్-3’ చెక్ పెడుతుందా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు