ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “జన నాయగన్” (Jana Nayagan). భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా మన తెలుగు చిత్రం భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ గా తీశారు. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో రాజా సాబ్ తో క్లాష్ కి రావాల్సి ఉంది కానీ ఊహించని కారణాలు రీత్యా ఆగాల్సి వచ్చింది.
ఇక కొత్త డేట్ ఏంటి ఎప్పుడు అనేది సస్పెన్స్ గా నిలిచాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ విషయమై కోర్ట్ లో కేసు నడుస్తుంది. నేడు చెన్నై హై కోర్ట్ లో ఈ సినిమాపై హియరింగ్ ఉంది. ఈరోజు ఫైనల్ తీర్పు అన్నట్టు తెలుస్తుంది. దీనితో విజయ్ అభిమానులు సహా కోలీవుడ్ ఆడియెన్స్ నేడు వెలువడే తీర్పు కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ తీర్పు సానుకూలంగా వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.


