మజిలీ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ !

Published on Mar 31, 2019 12:00 pm IST

మజిలీ టీజర్ 80 లక్షలకు పైగా వ్యూస్ ను రాబట్టి సినిమా ఫై భారీ అంచనాలను క్రీయేట్ చేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ కోసం ఎదురుస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఇటీవల వరస విజయాలతో సమంత ఫుల్ ఫామ్ లో ఉండగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు చైతూ. వీరిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకోనుంది. ఈ ఈవెంట్ కు వెంకటేష్ ,నాగార్జున ముఖ్య అతిధులుగా రానున్నారు.

ఇక ఇదే ఈవెంట్ లో ట్రైలర్ ను విడుదలచేయనున్నారు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది. ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా గా రానున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More