‘పెద్ది’ డే 1 పైనే అందరి కళ్ళు!

‘పెద్ది’ డే 1 పైనే అందరి కళ్ళు!

Published on Jun 5, 2026 9:00 AM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన అవైటెడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే “పెద్ది”. ఒక సాలిడ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలు సెట్ చేసుకొని వాటిని రీచ్ అయ్యింది. ఇలా డే 1 ని సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కంప్లీట్ చేసుకుంది. అయితే పెద్ది అఫీషియల్ డే 1 నెంబర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అనధికారికంగానే సుమారు 100 కోట్ల గ్రాస్ ఈ సినిమా వసూలు చేస్తుంది అనే టాక్ ఉంది. కానీ అధికారికంగా మేకర్స్ ఇచ్చే నెంబర్ పట్ల ఆసక్తి నెలకొంది. సో మేకర్స్ అనౌన్స్ చేస్తారా లేక స్కిప్ చేసేస్తారా అనేది చూడాలి. ఇక ఈ సినిమా ఆల్రెడీ డే 2 కూడా సాలిడ్ బుకింగ్స్ ని జరుపుకోగా స్ట్రాంగ్ వసూళ్ళు దిశగా వీకెండ్ లో దూసుకెళ్తుంది. ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు