రాజా సాబ్ బుకింగ్స్ కోసమే అందరి కళ్ళు!

రాజా సాబ్ బుకింగ్స్ కోసమే అందరి కళ్ళు!

Published on Jan 8, 2026 8:07 AM IST

Raja-Saab

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ అలాగే రిద్ది కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ది రాజా సాబ్(Raja Saab). మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్ గా థియేటర్స్ లో సందడి చేసేందుకు ఇప్పుడు రాబోతుంది. అయితే రేపు జనవరి 9న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమా నేడు గ్రాండ్ పైడ్ ప్రీమియర్స్ ని కూడా లాక్ చేసుకుంది.

కానీ ఈ రెండిటి బుకింగ్స్ పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. కేవలం గంటల వ్యవధి మాత్రమే ఉండడంతో అసలు బుకింగ్స్ ఇంకెప్పుడు ఓపెన్ చేస్తారు అని అంతా ఎదురు చూస్తున్నారు. సో లాస్ట్ మినిట్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది మరింత టెన్షన్ గా మారింది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు