ఫైనల్‌గా ‘కొబ్బరిమట్ట’కు మోక్షం లభించింది

Published on Jun 18, 2019 9:16 pm IST


‘హృదయకాలేయం’ చిత్రంతో హీరోగా పరిచయమై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో సంపూర్ణేష్ బాబు. ఈయన షూటింగ్ పూర్తిచేసిన సినిమాల్లో ‘కొబ్బరిమట్ట’ కూడా ఒకటి. అన్నిపనులు ముగిసి చాలా రోజులే అయినా పలు కారణాల వలన చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఫైనల్‌గా అన్ని అడ్డంకులు తొలగడంతో సినిమాను విడుదలచేయదానికి సిద్ధమయ్యారు నిర్మాతలు.

విడుదల తేదీని 20వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రకటించనున్నారు. రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను స్టీవెన్ శంకర్ నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమాలో సంపూ పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడు అనే మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇది ఎంటర్టైన్మెంట్ నిండిన పూర్తి కుటుంబ కథా చిత్రంగా ఉండనుంది.

సంబంధిత సమాచారం :

X
More