‘ఇండియన్ 2’కు అడ్డంకులు తొలగినట్టే !

Published on May 16, 2019 3:16 pm IST

21 సంవత్సరాల క్రితం విడుదలైన శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ఇండియన్’. దీనికి కొనగసాగింపుగా ‘ఇండియన్ 2’ను గత ఏడాదిలోనే స్టార్ట్ చేశారు. కమల్ హాసన్ షూటింగ్లో కూడా పాల్గొన్నారు. కానీ బడ్జెట్ విషయంలో విబేధాలు రావడంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సినిమాను అప్పటికప్పుడు నిలిపివేసింది. దీంతో ఈ సినిమా ఇప్పుడప్పుడే స్టార్ట్ కాదనే వార్తలూ వచ్చాయి.

కానీ కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం విబేధాలన్నీ తొలగాయని, శంకర్, నిర్మాతలు కలిసి చర్చించుకుని బడ్జెట్ విషయంలో ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. కాబట్టి జూన్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. 2021 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలవుతుందట. ఇందులో కమల్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More