కథ దొరికితే మెగా హీరోల నుండి రెండు మల్టీ స్టారర్లు..!

కథ దొరికితే మెగా హీరోల నుండి రెండు మల్టీ స్టారర్లు..!

Published on Dec 21, 2019 7:06 AM IST

sai dharam tej varun tej

చిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్స్ కి ఉండే క్రేజే వేరు. ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కనిపించడం ఆసక్తిగొలిపే అంశం. అలాంటిది తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన అనేక మంది స్టార్ట్ హీరోలు ఉన్న మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు కలిసి మూవీ చేస్తే ఆ మల్టీ స్టారర్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐతే మెగా ఫ్యామిలీ నుండి నలుగురు స్టార్ట్ లు రెండు మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. దీని గురించి ఆల్రెడీ మేమిద్దరం చర్చించుకున్నాం అని అన్నారు. ఐతే కథ కోసం వెయిటింగ్ అని ఆయన చెప్పారు. ఇక పింక్ రీమేక్ మూవీ తో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేయనున్నారని సమాచారం. గతంలో ఆయన రాజకీయాలలో బిజీ కావడం వలన కార్యరూపం దాల్చని చరణ్ మరియు పవన్ ల మల్టీ స్టారర్ కూడా భవిష్యత్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. ఈ మెగా ప్రాజెక్ట్ కి కావాల్సింది కేవలం మంచి కథ ఓ టాలెంటెడ్ డైరెక్టర్. కాబట్టి మంచి కథలు దొరికితే మెగా హీరోల నుండి రెండు మల్టీ స్టారర్ లు రావడం ఖాయం.

తాజా వార్తలు