“గుడ్ లక్ సఖి” రిలీజ్ కన్ఫ్యూజన్ పై ఆల్మోస్ట్ క్లారిటీ.!

Published on Jun 8, 2021 8:00 am IST

“మహానటి” చిత్రంతో సౌత్ ఇండియన్ సినిమాలో మంచి ఫేమ్ ను అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ అక్కడ నుంచి ఒక్క హీరోయిన్ గానే కాకుండా మరిన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ వస్తుంది. మరి అలా ఎప్పుడో మొదలు పెట్టేసిన చిత్రం “గుడ్ లక్ సఖి”. నగేష్ కుకునూర్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు మరియు తమిళ్ అలాగే మళయాళ భాషల్లో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేశారు.

మరి అలా ఇప్పటికే వచ్చిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ జూన్ నెలలోనే థియేట్రికల్ విడుదలకు ప్లాన్ చేసిన మేకర్స్ ప్రస్తుత పరిస్థితుల రీత్యా నిలిపివేశారు. దీనితో ఈ చిత్రం రిలీజ్ పై కన్ఫ్యూజన్ నెలకొంది.. ఓ పక్క థియేటర్స్ లోనే విడుదల అవుతుంది అని టాక్ రాగా మరోపక్క ఓటిటిలో విడుదల అవుతుంది అని బజ్ ఉంది.

అయితే వీటిలో మాత్రం మేకర్స్ నుంచి ఉన్న ప్లాన్ ఓటిటి వైపే అని తెలుస్తుంది. ఆల్రెడీ నిర్మాతల్లో ఒకరైన శ్రావ్య కూడ చిన్న హింట్ ఇచ్చి వదిలేసారు. దీనితో ఈ చిత్రం ఆల్మోస్ట్ ఓటిటిలోనే రిలీజ్ కానున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా జగపతిబాబు, ఆదిపినిశెట్టి తదితర కీలక నటులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :