“అఖండ” యూఎస్ గ్రాండ్ రిలీజ్ కి సర్వం సిద్ధం.!

Published on Nov 19, 2021 11:02 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన భారీ సినిమా “అఖండ”. బాలయ్య కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మరియు భారీ బడ్జెట్ తో తీసిన సినిమా ఇది. పైగా సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో బోయపాటి ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తుండడంతో బాలయ్య అభిమానులు ఎప్పుడు నుంచో దీని కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక డిసెంబర్ 2న భారీ లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం యూఎస్ లో గ్రాండ్ ప్రీమియర్స్ కి కూడా సిద్ధం అవుతుంది. రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వారి డిస్ట్రిబ్యూషన్ లో ఓవర్సీస్ మార్కెట్ లో ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. లేటెస్ట్ గా టోటల్ థియేటర్ లిస్ట్ కూడా వచ్చి వైరల్ అవుతుంది. దీనిని బట్టి అఖండ రిలీజ్ గ్రాండ్ గా ఉండబోతున్నట్టు అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More