అక్కడ “అల వైకుంఠపురములో” కోసం అంతా సిద్ధం.!

Published on Jun 13, 2021 9:30 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం వారి కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ హిస్టరీలోనే మరో భారీ హిట్ చిత్రంగా నిలిచింది. దీనితో ఈ సినిమా సాధించిన అఖండ విజయం పాన్ ఇండియన్ లెవెల్లో కూడా రీచ్ అయ్యింది. అందుకే బాలీవుడ్ వర్గాలు ఈ చిత్రం రీమేక్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

అయితే గత ఏడాది నుంచి ఈ చిత్రంపై నడుస్తున్న చర్చ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. ఈ చిత్రంలో మెయిన్ లీడ్ రోల్స్ లో అక్కడి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరియు కృతి సనన్ లు ఫైనల్ కాగా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. అలాగే ఈ చిత్రాన్ని అక్కడ గీతా ఆర్ట్స్ వారు నిర్మాణం వహించనున్నారు. మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :