బాలయ్య నెక్స్ట్ కు సర్వం సిద్ధం.?

Published on May 6, 2021 2:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ “అఖండ” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం అనంతరం బాలయ్య ఏ దర్శకునితో సినిమా చేస్తారో అన్నది కూడా ఆసక్తిగా మారింది. దీనితో ఈ క్రమంలోనే ఇద్దరు హిట్ దర్శకుల పేర్లు రేస్ లోకి వచ్చాయి. వారిలో దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఒకరు.

మరి ఈ సెన్సేషనల్ కాంబోపై లేటెస్ట్ టాక్ బయటకి వచ్చింది. ఆల్రెడీ గోపీచంద్ బాలయ్య కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసేసారట. అంతే కాకుండా క్యాస్టింగ్ పరంగా కూడా ఆల్ మోస్ట్ పనులు పూర్తి కావడమే కాకుండా ఇద్దరు హీరోయిన్స్ ను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ కాంబో ఆల్రెడీ ఆల్ మోస్ట్ సిద్ధం అయ్యిపోయినట్టే అని చెప్పాలి. ఇక మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :