“కేస్ 30” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కు ఆల్ సెట్.!

“కేస్ 30” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కు ఆల్ సెట్.!

Published on Oct 25, 2020 2:04 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దార్థ్ నాయుడు లేటెస్ట్ గా నటిస్తున్న ఆసక్తికర చిత్రం “కేస్ 30”. ఇటీవలే విడుదల కాబడిన ప్రీ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న యూనిట్ ఫస్ట్ లుక్ లాంచ్ కోసం ఆల్ సెట్ చేసారు. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రంలో హీరోగా కనిపిస్తుండడమే కాకుండా కథను కూడా తానే అందించడం మరో విశేషం. అలాగే ఈ ఆసక్తికర సబ్జెక్టును దర్శకుడు సందీప్ పైడిమర్రి దర్శకత్వం వహించనున్నారు.

అయితే ఈ చిత్రాన్ని సిద్దార్థ్ ఒక ఆసక్తికర థ్రిల్లర్ గా ప్లాన్ చేశారట. ప్రీ లుక్ పోస్టర్ తో మంచి బజ్ ఏర్పర్చుకున్న వీరి టీం ఈ అక్టోబర్ 26 ఉదయం 10 గంటల 25 నిమిషాలకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చెయ్యనున్నారు. జెరోమ్ ఎస్వీ సంగీతం అందిస్తుండగా గ్యారీ బి హెచ్ ఎడిటింగ్, అలాగే గౌతమ్ బండ్రెడ్డి సినిమాటోగ్రఫీ ఇస్తున్నారు. అలాగే ఈ థ్రిల్లింగ్ చిత్రాన్ని పి ఎన్ ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు