“సుల్తాన్” డిజిటల్ ప్రీమియర్స్ కు ఆల్ సెట్.!

Published on Apr 28, 2021 1:28 pm IST

కోలీవుడ్ హీరో కార్తీ సినిమాలకు మన దగ్గర కూడా మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. తన లేటెస్ట్ చిత్రం “ఖైదీ”తో అటు తమిళ్ మరియు తెలుగులో కూడా మంచి కం బ్యాక్ ఇచ్చిన కార్తీ రీసెంట్ గా “సుల్తాన్” సినిమాతో పలకరించాడు. మరి ఈ చిత్రం స్ట్రీమింగ్ కు రావడం ఆల్రెడీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. తన లాస్ట్ చిత్రం ఖైదీ ని తమిళ్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు స్ట్రీమ్ చెయ్యగా..

తెలుగు వెర్షన్ కు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” వారు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు సుల్తాన్ కు కూడా అలాగే ఈ రెండు ప్లాట్ ఫామ్స్ లోనే అందుబాటులోకి తీసుకొస్తుండగా వచ్చే ఏప్రిల్ 30 నుంచి ఆహా లో స్ట్రీమ్ కానున్న ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చెయ్యాలని కార్తీ క్లారిటీ ఇచ్చేసాడు. దీనితో ఏప్రిల్ 30 కి ఈ యాక్షన్ ఫన్ డ్రామా డిజిటల్ ప్రీమియర్స్ కు అంతా సిద్ధం అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :