నైజాంలో కూడా మెగాస్టార్ బ్లాస్ట్ కి ఆల్ సెట్.. ప్రీమియర్స్ టైమింగ్, రేట్స్ డీటెయిల్స్

Mana Shankara Varaprasad Garu

ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ చిత్రాల్లో మెగా అభిమానులు అంతే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమే ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu). దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మెగాస్టార్ వింటేజ్ హిట్ కొట్టేలా ఉన్నారని అభిమానులు గట్టిగా భావిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా నైజాం మార్కెట్ పరంగా కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది.

తెలంగాణాలో ఎర్లీ షో, ప్రీమియర్స్ తాలూకా ధరల డీటెయిల్స్

ఆంధ్ర ప్రదేశ్ లో ఆల్రెడీ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) కి టికెట్ ధరల హైక్ లు అలానే ప్రీమియర్స్ కూడా లాక్ అయ్యాయి. మరి తెలంగాణాలో కూడా పెద్దగా జాప్యం లేకుండా జీ ఓ బయటకి వచ్చేసింది. దీని ప్రకారం ముందు రోజే పడనున్న ప్రీమియర్స్ కి టికెట్ ధర 600 పెట్టగా తెలంగాణ మొత్తం షోలు రాత్రి 8 గంటల నుంచే మొదలు కానున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో మెగా బ్లాస్ట్ అప్పుడు నుంచి మొదలు కానుంది అని చెప్పాలి.

డే 1 నుంచి ఇతర ధరల వివరాలు

ప్రీమియర్స్ కి 600 టికెట్ ధర నిర్ణయించగా డే 1 నుంచి సింగిల్ స్క్రీన్స్ లో గరిష్టంగా 50 రూపాయలు మల్టిప్లెక్స్ లలో 100 రూపాయల హైక్ ని అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీ ఓ ఇచ్చారు. ఇక ఈ హైక్ లు మొత్తం జనవరి 12 నుంచి 18 వరకు మొత్తం వారం పాటు కొనసాగనున్నాయి.

సో ఇలా మొత్తానికి మన శంకర వర ప్రసాద్ గారు కి మొత్తం సెట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ ఉంటాయో చూడాలి.

Exit mobile version