అవైటెడ్ మాస్ మహారాజ్ “ఖిలాడి” టీజర్ కు టైం ఫిక్స్!

Published on Apr 9, 2021 10:58 am IST

ఈ ఏడాది తెలుగు సినిమా దగ్గర మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మాస్ మహారాజ్ పేరిట “క్రాక్” తో స్టార్ట్ అయ్యింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హ్యాట్రిక్ చిత్రం కేవలం 50 శాతం సీటింగ్ తోనే భారీ వసూళ్లను రాబట్టి రవితేజకు సూపర్ కం బ్యాక్ ఇచ్చింది. ఇక దీని తర్వాత దర్శకుడు రమేష్ వర్మతో మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “ఖిలాడి” ను సూపర్ స్పీడ్ గా స్టార్ట్ చేసి ఈ ఏడాది సగం పూర్తి కాకముందే రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ను మేకర్స్ ఫిక్స్ చేసేసారు. దీనిని ఈ ఉగాది కానుకగా వచ్చే 12వ తారీఖున 10 గంటల 8 నిమిషాలకు విడుదల చెయ్యాలని ఫిక్స్ చేశారు. మరి ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి మరియు సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పెన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :