సాయి తేజ్ – దేవకట్టా ప్రాజెక్ట్ కు ఆల్ సెట్..!

Published on Sep 23, 2020 4:00 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రెండు వరుస విజయాలతో తన ఫ్లాపుల పరంపరకు చెక్ పెట్టి మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. “చిత్రలహరి”, “ప్రతీరోజూ పండగే” హిట్లకు ఇపుడు చేస్తున్న “సోలో బ్రతుకే సో బెటర్” తో మరో హిట్ ను ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు.

అయితే ఈ చిత్రం ఇంకా లైన్ లో ఉండగానే సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక మైథలాజికల్ థ్రిల్లర్ ను తన 15వ చిత్రంగా అనౌన్స్ చేసారు. జస్ట్ ప్రీ లుక్ పోస్టర్ తోనే మంచి హైప్ ఈ చిత్రం సంతరించుకుంది. ఇక ఇప్పుడు సాయి తేజ్ చేయనున్న 14వ చిత్రానికి సంబంధించి అధికారిక అప్డేట్ వచ్చేసింది.

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవకట్ట ఖరారు చేసేసారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిపోయిందని షూట్ కూడా వచ్చే అక్టోబర్ నెల మధ్యలోనే మొదలు కానుంది అని కన్ఫర్మ్ చేసేసారు. మరి ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ దర్శకునితో సాయి తేజ్ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ సెట్టయ్యింది.

సంబంధిత సమాచారం :

More