“సర్కారు వారి పాట”కి సర్వం సిద్దమట.!

Published on Jun 26, 2021 10:06 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కరోనా వల్ల ఆ షెడ్యూల్ అందాకా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.

అయితే ఇప్పుడు ఎట్టకేలకు మళ్ళీ ఈ షెడ్యూల్ షూట్ కి రంగం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. మరి జూలై నెలలో ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ ఇంకొన్ని రోజుల్లోనే స్టార్ట్ కానుందట. అలాగే ఈ షూట్ లో మహేష్ సహా ఇతర ప్రధాన నటులు కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :